నీటి కుంటలో మునిగి.. నలుగురు మృతి

23చూసినవారు
నీటి కుంటలో మునిగి.. నలుగురు మృతి
రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలోని నీటి కుంటలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మృతి చెందారు. నీటిని తీస్తుండగా పూజా నాయక్(14) జారిపడగా.. కాపాడేందుకు మరో ముగ్గురు కుంటలోకి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు. మృతులు ముకేష్ (21), నిర్మల్ (18), మనోజ్, పూజ (14)గా గుర్తించారు. ఒకే ఇంట్లో నలుగురు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్