ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో
టీ20 మ్యాచ్‌లో భారత్ పై వెస్టిండీస్ ఘన విజయం సాదించింది. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 247/3 పరుగులు చేసింది. షై హోప్ 102* (50 బంతుల్లో), రూథర్‌ఫర్డ్ 49* పరుగులతో (26 బంతుల్లో) సత్తా చాటారు. హెట్‌మయర్ 33, రోవ్‌మన్ పావెల్ 24, జువెల్ ఆండ్రూ 21 రన్స్ చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన
భారత్ 19.4 ఓవర్లకు 223 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజు (56), అభిషేక్ శర్మ (29), తిలక్ వర్మ (43), నితీష్ కుమార్ (41), శ్రేయాస్ అయ్యర్ (16) పరుగులు తీశారు.