FSSAI నోటీసులు.. '100 శాతం' లేబుల్‌ తొలగింపు

12663చూసినవారు
FSSAI నోటీసులు.. '100 శాతం' లేబుల్‌ తొలగింపు
భారత ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) నోటీసులతో పలు ఫుడ్‌ కంపెనీలు తమ ఉత్పత్తుల లేబుల్స్‌లో మార్పులు చేస్తున్నాయి. కస్టమర్లను తప్పుదోవ పట్టించే పదాలను తొలగించాలని ఆదేశించడంతో ఆమ్వే ఇండియా, జుజా ఫుడ్స్, మోండెలెజ్ ఇండియా, సేపియన్స్ ల్యాబ్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఆమ్వే ‘ఎనర్జీ డ్రింక్’, కొబ్బరి నూనెపై ఉన్న ‘100 శాతం’ పదాలను తొలగించగా.. జుజా ఫుడ్స్ ‘ప్యూర్, నేచురల్, ట్రెడిషనల్, 100 శాతం రాగి’ వంటి పదాలను తొలగిస్తోంది. మొత్తం 150 సంస్థలకు FSSAI నోటీసులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్