
ఏఐ సుందరి కోసం ఆస్తులమ్మిన వ్యక్తి.. చివరకు నిరాశ
బ్రెజిల్‌కు చెందిన 49 ఏళ్ల ఎడిమార్ మార్టిన్స్, సోషల్ మీడియాలో పరిచయమైన 'జెస్సికా'ను వివాహం చేసుకునేందుకు తన ఆస్తులను అమ్మి అక్టోబర్ 9న ప్రయాణమై, అక్టోబర్ 11న బెలో హొరిజోంటే నగరానికి చేరుకున్నాడు. కానీ, అక్కడ ఆ మహిళ కృత్రిమ మేధస్సు (AI) సృష్టించిన కల్పిత పాత్ర అని తెలిసి షాక్‌కు గురయ్యాడు. తిరిగి వెళ్లేందుకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్న మార్టిన్స్‌కు అధికారులు సాయం అందించారు. బెలో హొరిజోంటేలో 6 నెలల వ్యవధిలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడం ఇది మూడోసారి.




