తిరుమలలో అక్టోబర్ 26వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ మలయప్పస్వామి వారి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్యలో సర్వాలంకార భూషితుడైన స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ఈ విశేషమైన సేవను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ కార్యక్రమం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.