
అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్లా షా ఖాద్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కర్నూలు జిల్లాలోని వారి స్వగృహానికి శుక్రవారం వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు.

































