అలంపూర్ మండలం - Alampur Mandal

జోగులాంబ గద్వాల జిల్లా
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Sep 16, 2026, 06:09 IST/

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Sep 16, 2026, 06:09 IST
కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.