
మక్తల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో శనివారం విద్యుత్ అంతరాయం కలగనుంది. బ్రిలియంట్ స్కూల్ సమీపంలోని 100 KV మరియు నెహ్రూగంజ్లోని 100 KV ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్లింత్ నిర్మాణ పనుల కారణంగా, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ వెంకటేష్ తెలిపారు. సంగంబండ రోడ్ ప్రాంతంలోని విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.







































