ఊట్కూర్ మండల నూతన ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పావనిని బుధవారం మండల
కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పావని మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పనిచేస్తానని పేర్కొన్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని
కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.