మక్తల్‌లో SIRపై కాంగ్రెస్ సమీక్ష

1396చూసినవారు
మక్తల్‌లో SIRపై కాంగ్రెస్ సమీక్ష
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. మక్తల్‌లోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో BLAలు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, పేదలు, బలహీన వర్గాల ఓట్లు తొలగిపోకుండా చూడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. పార్టీ ఆదేశాలను వంద శాతం పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అమిత్ రెడ్డి, రేవతి గౌడ్, ప్రశాంత్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్