భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం బాపూజీ నగర్లో జరుగుతున్న వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా, శుక్రవారం గణనాథుడిని రూ.1.45 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందిన మెహర్ బాబా డెకరేషన్ బృందం ఈ అద్భుతమైన అలంకరణను చేపట్టింది. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.