ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కంప్యూటర్ షాపు ముసుగులో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును DRI అధికారులు రట్టు చేశారు. ఈ ఆకస్మిక దాడిలో, ల్యాబ్‌లో తయారీ దశలో ఉన్న 148 కిలోల అల్ప్రాజోలంతో పాటు, అక్రమంగా నిల్వ ఉంచిన 1,046 కిలోల ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ షాపు వెనుక సాగుతున్న ఈ అక్రమ డ్రగ్స్ తయారీ వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.