మంచు దుప్పటిలో గంగోత్రి ధామ్‌ (వీడియో)

8చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంగోత్రి ధామ్‌లో గురువారం ఈ సీజన్‌లో తొలిసారిగా భారీ హిమపాతం నమోదైంది. ఈ తాజా మంచు కురువడంతో గంగోత్రి ఆలయ పరిసరాలు, హిమాలయ పర్వత శ్రేణులు తెల్లటి మంచు దుప్పటిని కప్పుకున్నాయి. మంచు ప్రభావంతో ఉత్తరకాశీ జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, యాత్రికులు మంచు అందాలను ఆస్వాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి శిఖరాలపై కూడా మంచు పడుతోంది.

సంబంధిత పోస్ట్