కొత్త పాన్ కార్డు కోసం ఇక రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆధార్ నెంబర్, మొబైల్ ఉంటే చాలు, నిమిషాల్లోనే ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సులభంగా ఈ-పాన్ కార్డు పొందవచ్చు. ఆదాయపు పన్ను పోర్టల్‌లో 'Get New e-PAN' ఆప్షన్‌ను ఎంచుకుని, ఆధార్ నెంబర్, మొబైల్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరణ పూర్తి చేస్తే చాలు. ఆధార్ వివరాలు ఆటోమేటిక్‌గా తీసుకుని, సబ్మిట్ చేస్తే వెంటనే ఈ-పాన్ జనరేట్ అవుతుంది. దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఇదే పోర్టల్‌లో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.