భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి భారత్ 125 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98: 146 బంతుల్లో) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో బ్యాటర్ రిషభ్ పంత్ (55*) అర్ధశతకం చేశాడు. ప్రస్తుతం భారత్ 118 పరుగుల ఆధిక్యంలో ఉంది.