RMP వైద్యం వికటించి బాలిక మృతి

34చూసినవారు
RMP వైద్యం వికటించి బాలిక మృతి
AP: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో చోటుచేసుకుంది. పునరావాస కాలనీకి చెందిన వాళ్ల లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భాగ్యలక్ష్మి(7) నాలుగు రోజుల కిందట జ్వరం బారిన పడింది. రామన్నగూడెంలో ఉంటున్న ఆర్ఎంపీ ఈమెకు రక్త పరీక్షలు చేయించి వైద్యం చేశారు. బాలిక పరిస్థితి విషమించి శనివారం మృతి చెందింది.  ఆర్ఎంపీ వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్