కడుపు నొప్పితో బాధపడుతూ బాలిక మృతి

8చూసినవారు
కడుపు నొప్పితో బాధపడుతూ బాలిక మృతి
AP: మన్యం జిల్లా సాలూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. దిగువకాశాయవలస గ్రామానికి చెందిన తాడంగి రాజారావు, అమ్మాజీలకు ముగ్గురు సంతానం. పెద్దకుమార్తె లావణ్య(13) కురుకుట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 11న పాఠశాలలో లావణ్య పుష్పవతి కావడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. బాలికకు మంగళస్నానం చేయించేందుకు సిద్ధమవుతుండగా కడుపునొప్పిగా ఉందని ఇంట్లో వారికి చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యేలోపు నొప్పి తాళలేక మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్