కాకినాడ సముద్రతీరంలో బాలిక గల్లంతు

18చూసినవారు
కాకినాడ సముద్రతీరంలో బాలిక గల్లంతు
AP: కాకినాడలోని పెరుమాళ్లపురం సముద్రతీరంలో బాలిక గల్లంతైంది. ఎండపల్లికి చెందిన యశ్వంతిక (12) సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైంది. దుర్గాడలో యశ్వంతిక పుట్టినరోజు వేడుకలకు కుటుంబసభ్యులు వచ్చారు. దుర్గాడ నుంచి పెరుమాళ్లపురం సముద్రతీరానికి వెళ్లారు. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన నలుగురిలో జాలర్లు ముగ్గురిని కాపాడారు. అస్వస్థతకు గురైన ముగ్గురిని పిఠాపురం ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన బాలిక కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్