
ఈపీఎఫ్ ఖాతాలో నేరుగా నగదు జమ: కేంద్రం
ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇటీవల జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఉద్యోగులు తమ యజమాని ప్రమేయం లేకుండానే నేరుగా పీఎఫ్ ఖాతాల్లో అదనపు డబ్బులు జమ చేసుకునే విధానాన్ని ప్రతిపాదించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా గిగ్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు సైతం తమ ఆదాయాన్ని పొదుపు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన గరిష్ఠ పరిమితి, పన్ను నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తుది ఆమోదం కోసం వేచి చూస్తున్నారు.




