భూటాన్‌లో హిమనీనద సరస్సు విస్ఫోటం

32చూసినవారు
భూటాన్‌లో హిమనీనద సరస్సు విస్ఫోటం
హిమాలయ దేశమైన భూటాన్‌లోని షింటఫు హిమనీనద సరస్సు ఇటీవల విస్ఫోటం చెందింది. ఈ ఘటన కారణంగా భారత్‌లోకి అకస్మాత్తుగా భారీగా నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల సంకోష్ నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమై అస్సాం మరియు నార్త్ బెంగాల్ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. నదీ తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్