
బీచ్‌లో 16 అడుగుల ‘ఓర్ఫిష్’.. భారీ భూకంపం రాబోతోందా?
చిలీలోని అరికా బీచ్ వద్ద అక్టోబర్ 20న సుమారు 16 అడుగుల పొడవున్న అరుదైన ఓర్ఫిష్ కొట్టుకురావడం చర్చనీయాంశమైంది. 'డూమ్స్‌డే ఫిష్'గా పిలిచే ఈ చేప కనిపిస్తే భూకంపాలు, సునామీలు వస్తాయన్న పుకార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, శాస్త్రవేత్తలు ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. సముద్ర ప్రవాహాలు, గాయాల వల్ల ఇవి దారి తప్పి వస్తాయని, ప్రకృతి విపత్తులకు, ఈ చేపలకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు పుకార్లను నమ్మి భయపడొద్దని నిపుణులు సూచిస్తున్నారు.




