గోల్కొండకు చెందిన అరుదైన ‘బల్గారి పింక్’ వజ్రం అంతర్జాతీయ వేలంలో సుమారు రూ.130 కోట్ల ధర పలికింది. 24 క్యారెట్ల ఈ వజ్రాన్ని క్రిస్టీస్ సంస్థ జెనీవాలో నిర్వహించిన వేలంలో 12.086 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు విక్రయించింది. 1950లలో గోల్కొండ నుంచి కొనుగోలు చేసిన ఈ వజ్రాన్ని ఇటలీలోని బల్గారి సంస్థ ఉంగరంగా రూపొందించింది. దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద ఉన్న దీన్ని తొలిసారిగా వేలానికి తీసుకొచ్చారు. అరుదైన పింక్ రంగు, అత్యుత్తమ నాణ్యత కారణంగా క్రిస్టీస్ దీన్ని ‘పింక్ డైమండ్స్‌లో మోనాలిసా’గా అభివర్ణించింది.