బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.750 తగ్గి రూ.1,25,400కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.820 తగ్గి రూ.1,36,800 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో రూ.1,90,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.