సూడాన్లోని వెస్ట్ కోర్డోఫ్యాన్ ప్రావిన్స్లో బంగారు గని కుప్పకూలి 67 మంది మృతి చెందారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అనేక మంది గనిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.