బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.850 తగ్గి రూ.1,40,400కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.920 తగ్గి రూ.1,53,170 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.