దసరా పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో మంగళవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 తగ్గి.. రూ1,47,170 వద్దకు చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,34,900గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.