బంగారం ధరలు బుధవారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.950 తగ్గి రూ.1,35,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,030 తగ్గి రూ.1,48,260 పలుకుతోంది. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై రూ.3,160, 22 క్యారెట్ల పసిడిపై రూ.2900 తగ్గింది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.