గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.1,37,620కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,26,150 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేట్ రూ.1,95,000 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండనున్నాయి.