హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు సోమవారం కూడా స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.170 పెరిగి రూ.1,42,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరగడంతో రూ.1,30,850 పలుకుతోంది. కేజీ సిల్వర్ ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్వల్ప తేడాలుండొచ్చు.