భారీగా తగ్గనున్న బంగారం ధరలు!

31చూసినవారు
భారీగా తగ్గనున్న బంగారం ధరలు!
బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు పసిడి ధరలపై ప్రభావం చూపనున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గి, ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్ల వైపు మళ్లే అవకాశముంది. గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా ప్రకారం, 2027 డిసెంబర్ నాటికి ఔన్స్ బంగారం ధర 4,650 డాలర్లకు చేరవచ్చు. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.20 లక్షలకు దిగివచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇవి అంచనాలు మాత్రమేనని, అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని గుర్తించాలి.

సంబంధిత పోస్ట్