వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్లో ‘గోల్డెన్ మోదక్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యా వికాస్ సర్కిల్లోని సాగర్ స్వీట్స్ ఈ మోదక్పై తినదగిన బంగారు పూతను పూసి విక్రయిస్తోంది. కిలోకు రూ.27 వేల ధర నిర్ణయించడంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతేడాది కిలో రూ.20 వేలు, 2021లో రూ.12 వేలుగా ఉన్న ధర ప్రస్తుతం భారీగా పెరిగింది. మరోవైపు తినదగిన వెండి పూతతో తయారు చేసిన ‘సిల్వర్ మోదక్’లను కూడా షాపు అందుబాటులోకి తెచ్చింది.