శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. విమానాల్లో శబరిమలకు వెళ్లే భక్తులు తమ ఇరుముడి కట్టును విమాన క్యాబిన్లో (హ్యాండ్ బ్యాగేజీగా) వెంట తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల పవిత్ర యాత్ర సాఫీగా కొనసాగించేందుకు ఎయిర్ పోర్టు సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేశామని పేర్కొన్నారు.