కూల్ డ్రింక్స్, బీర్ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. అల్యూమినియం బెవరేజ్ క్యాన్ల నాణ్యత ప్రామాణీకరణ గడువును 2027 ఏప్రిల్ వరకు పొడిగిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ
నోటిఫికేషన్ విడుదల చేసింది. సరఫరా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కంపెనీలకు ఇది మేలు చేయనుంది. కొత్త నిబంధనల ప్రకారం, భారీ పరిశ్రమలకు 2027 ఏప్రిల్ 1, చిన్న తరహా పరిశ్రమలకు జులై 1, మరియు అతి చిన్న పరిశ్రమలకు 2027 అక్టోబర్ 1 వరకు గడువును పెంచారు. ఈ నిర్ణయంతో కీలక పానీయాల బ్రాండ్లకు ఉపశమనం కలగనుంది.