ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు శుభవార్త, ఇకపై మీరు ఇష్టమైన రీల్స్, స్టోరీలను బిగ్ స్క్రీన్‌పై చూడవచ్చు. మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ యాప్‌ను త్వరలో భారత్‌లోకి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా స్మార్ట్ టీవీల్లో కంటెంట్ చూడవచ్చు. ఆపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీలలో ఈ సదుపాయం ఉంటుంది. ఒకే టీవీలో ఐదు ఖాతాలను లాగిన్ చేయవచ్చు. ఫోన్ నుండి నేరుగా టీవీకి వీడియోలను క్యాస్ట్ చేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది.