తెలంగాణ రాజకీయాల్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లి, శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయింది. నెల రోజుల్లోగా పూర్తి లెక్కలు తేల్చాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మర్కుక్ తహశీల్దార్ కార్యాలయంలో పాత రికార్డులను పరిశీలిస్తూ, సర్వే నంబర్ 325 పరిధిలోని సుమారు 385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారులు ఆరా తీస్తున్నారు.