TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లను గురువారం ఈ నెల 18 వరకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. పెండింగ్ అప్లికేషన్ల వెరిఫికేషన్, ఆమోద ప్రక్రియను వెంటనే పూర్తి చేయాల్సిందిగా సెర్ప్ సీఈవో కలెక్టర్లకు సూచించారు. ఈ పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.