రైతులను ఈ సర్కార్ మోసం చేస్తోంది: హరీశ్‌రావు

22చూసినవారు
రైతులను ఈ సర్కార్ మోసం చేస్తోంది: హరీశ్‌రావు
TG: పంటలు ఎండిన ప్రాంతాల్లో రైతుల వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకూ సేకరించలేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రభుత్వాలు రైతులకు సాయం చేశాయని, ఇక్కడ మాత్రం రైతులను రేవంత్ సర్కార్​ మోసం చేస్తోందని ఆరోపించారు. వెంటనే యాసంగి రైతుబంధు నగదు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రైతులను ఈ ప్రభుత్వం ఎల్‌నినో పేరు చెప్పి భయపెడుతోందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్