TG: యాదాద్రి భువనగిరి(D) చౌటుప్పల్(M) తూప్రాన్‌పేట్‌లో డబ్బుల కోసం ఓ యువకుడు వరుసకు అమ్మమ్మ అయిన మంటిపల్లి యాదమ్మ (70)ను హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి నగలతో పరారయ్యాడు. ఈ నెల 27న యాదమ్మ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి బంధువైన మంటిపల్లి రాజు (31)పై అనుమానం రావడంతో బుధవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నాడు. డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.