మద్యం మత్తులో అవ్వను చంపిన మనవడు

55చూసినవారు
మద్యం మత్తులో అవ్వను చంపిన మనవడు
AP: మార్కాపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురానికి చెందిన పసుపులేటి లక్ష్మమ్మ అనే ఓ వృద్ధురాలిని మద్యం మత్తులో మనవడే పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు. మద్యానికి బానిసైన రాములు కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతుండేవాడు. దాంతో అతని భార్య 3 నెలల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చిన అతను.. తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దాంతో వారు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో మంచంపై నిద్రిస్తున్న అవ్వ లక్ష్మమ్మ(81)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆమె చనిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్