బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను కదలికలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా గ్రాఫికల్ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ తుఫాను నరసాపురానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, తీరం దాటే ప్రక్రియ నిలకడగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కల్లా ఈ ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.