ప్రధాని నరేంద్ర
మోదీ ముంబయిలో పాల్గొననున్న కార్యక్రమంలో భద్రతాపరమైన లోపాలు వెలుగులోకి వచ్చాయి. వేదిక వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నకిలీ పీఎంవో ఐడీ కార్డులు, ఒక తుపాకీ లభించాయి. వారిని రోహన్ పరేఖ్, అతని బాడీగార్డ్గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి, ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తున్నారు.