ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని దహేలీ ఉజాగర్ గ్రామంలో భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ, కాల్పులు చోటుచేసుకున్నాయి. 12 బోర్ లైసెన్స్‌డ్ గన్‌తో జరిపిన కాల్పుల్లో తూటాల గుళికలు తగిలి ముగ్గురు గాయపడగా, మరో వ్యక్తికి అయిన గాయాలపై వైద్య
పరీక్షలు నిర్వహిస్తున్నారు. నలుగురి పరిస్థితి నిలకడగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన ప్రధాన నిందితుడిని లైసెన్స్‌డ్ తుపాకీతో సహా అరెస్ట్ చేశారు. ఇరు వర్గాల విచారణ, అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.