బర్డ్ ఫ్లూ కట్టడికి H5N1 వ్యాక్సిన్ రెడీ

40చూసినవారు
బర్డ్ ఫ్లూ కట్టడికి H5N1 వ్యాక్సిన్ రెడీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి హెచ్‌5ఎన్‌1 వ్యాక్సిన్‌ను ఆవిష్కరించనున్నారు. భోపాల్‌లోని ఐకార్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ICAR-NIHSAD) ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇది H5N1 క్లేడ్ 2.3.2.1a వైరస్‌ను అడ్డుకుంటుంది. గతంలో బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగానికి జరిగిన ఆర్థిక నష్టాలను, పక్షుల మరణాలను అరికట్టేందుకు, ప్రజా ఆరోగ్య భద్రతను కాపాడేందుకు ఈ వ్యాక్సిన్ కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్