
ట్రెడ్‌మిల్‌పై నుంచి కిటికీలోంచి పడి 22 ఏళ్ల యువతి మృతి (VIDEO)
ఇండోనేషియాలోని ఒక జిమ్‌లో వ్యాయామం చేస్తున్న 22 ఏళ్ల యువతి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా అదుపుతప్పి వెనక్కి పడిపోయిన యువతి, అక్కడే ఉన్న తెరిచిన కిటికీలోంచి మూడో అంతస్తు నుండి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు ప్రధాన కారణం ట్రెడ్‌మిల్‌ను కిటికీకి చాలా దగ్గరగా ఏర్పాటు చేయడమేనని తెలుస్తోంది.




