TG: రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా, ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు నేటి నుంచి (ఆదివారం) అధికారిక వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 28 వరకు తమ హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 275 ఎస్సై పోస్టులకు సుమారు 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 29న జరగనున్న ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.