TG: కొత్తగా మంజూరు చేసిన చేనేత పింఛన్లను గురువారం నుంచి ఈ నెల 18 వరకు పంపిణీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పెండింగ్ అప్లికేషన్ల వెరిఫికేషన్, ఆమోద ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లకు సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసేందుకు మండలకేంద్రాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.