ఐపీఎల్ అరంగేట్ర సీజన్(2008)లో మాజీ పేసర్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య చోటు చేసుకున్న చెంపదెబ్బ ఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై హర్భజన్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఈ వీడియో లీకైన విధానం తప్పు. ఇలా చేయాల్సింది కాదు. దీని వెనుక వారి స్వార్థపూరిత ఉద్దేశం ఉంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనను అంతా మర్చిపోయారు. కానీ మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు’’ అని పేర్కొన్నాడు.