హరిద్వార్ కుంభమేళా షెడ్యూల్ విడుదల

8చూసినవారు
హరిద్వార్ కుంభమేళా షెడ్యూల్ విడుదల
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్ధ కుంభమేళా 2027కు అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఈ ఆధ్యాత్మిక వేడుక జనవరి 14, 2027న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 20, 2027న చైత్ర పూర్ణిమతో ముగియనుంది. మొత్తం 97 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవంలో మహాశివరాత్రి, సోమవతి అమావాస్య, మేష సంక్రాంతి వంటి ప్రధాన దినాలతో కలిపి 10 ముఖ్యమైన స్నానాలు ఉన్నాయి. భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం హర్ కీ పౌరి వద్ద విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్