TG; సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'అధికారులను సస్పెండ్ చేస్తే రైతుల బాధలు తీరుతాయా రేవంత్ రెడ్డి? ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే 12 లక్షల ఎకరాలు ఎండిపోయాయి. ఇంకో 20 రోజులు కాపాడితే మిగతా పంటలు ఎండిపోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.
కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు కదా? వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి. పంటలు ఎండిపోయిన రైతులకు సహాయం చేయాలి' అని డిమాండ్ చేశారు.