
సింగరేణిలో డేటా సెంటర్ల ఏర్పాటుపై అమెరికన్ కాన్సులేట్ ఆసక్తి
హైదరాబాద్లోని సింగరేణి భవన్లో శుక్రవారం అమెరికన్ కాన్సులేట్ అధికారుల బృందం, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో కీలక భేటీ నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సింగరేణి ప్రాంతం అనువైనదని అధికారులు పేర్కొన్నారు. మూతపడిన గనుల్లో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటు, కీలక ఖనిజాల అన్వేషణపై చర్చించారు. ఏప్రిల్లో అమెరికాలో జరగనున్న ఖనిజ సదస్సుకు హాజరు కావాలని సింగరేణిని అమెరికన్ బృందం ఆహ్వానించింది.




